“దీవాన” టైలర్ లో మేకర్స్ ప్యాషన్ తెలుస్తోంది. మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించిన విజయ్ దేవరకొండ
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
ఇటీవల దీవాన చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా దీవాన మూవీ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ట్రైలర్ తోనే సినిమాపై మేకర్స్ కు ఉన్న ప్యాషన్ తెలుస్తోందని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. హర్షిత్ రెడ్డి పర్ఫామెన్స్ తనకు బాగా నచ్చిందని విజయ్ పేర్కొన్నారు. ఈనెల 19న రిలీజ్ అవుతున్న దీవాన మూవీ పెద్ద సక్సెస్ అందుకోవాలని దర్శక నిర్మాతలు వాసు, శ్రీదేవి, శ్రీకాంత్ లకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు.
https://x.com/thedeverakonda/status/2065733659999838603?s=46








