జూలై 10న వస్తోన్న ‘లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్ నాగార్జున
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేది మారింది. ఇప్పుడు సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.
తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని నిర్మాత కింగ్ నాగార్జున తెలియజేశారు. లెనిన్ సినిమాను థియేటర్స్‌లో చూసే ఆడియెన్స్‌కు స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం బెటర్ ఔట్ పుట్ అవసరం. దాని కోసం మరింత సమయం కావాలని, ఎంటైర్ టీమ్ అందుకు కష్టపడుతోందని ఆయన తెలియజేశారు. టీమ్ తమ బెస్ట్ ఔట్పుట్ ఇవ్వడానికి మరింత టైమ్ కావాలని భావించిన మేకర్స్, రిలీజ్ డేట్‌ను జూలై 10కి మార్చారు. లెనిన్ మూవీలో ప్రేక్షకులు సరికొత్త అఖిల్ అక్కినేనిని చూడబోతున్నారంటూ అక్కినేని నాగార్జున హామీ ఇచ్చారు.
‘‘లెనిన్’ టీమ్ నా దగ్గరకు ఓ రిక్వెస్ట్‌తో వచ్చారు. వారు తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్‌తో స్పెషల్ మూవీని క్రియేట్ చేయటానికి కాస్త సమయం కావాలని అడిగారు. వారి ప్యాషన్, స్పిరిట్ చూసి నేను ఒప్పుకున్నాను. మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మరోసారి చెబుతున్నాను మీరు ఓ కొత్త అఖిల్‌ను చూస్తారు. గెట్ రెడీ ఫర్ ది లెనిన్ ఎక్స్‌పీరియెన్స్’ అని నాగార్జున పేర్కొన్నారు.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపాయి. టీమ్ తీసుకున్నఈ నిర్ణయం చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే టీమ్ ప్రమోషన్స్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ అవి ప్రమోషన్స్‌లో మరింత వేగం పుంజుకోనుంది.
మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరింత ఎఫెక్టివ్‌గా ఉండనుందని ఇప్పటి వరకు రిలీజైన కంటెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా జూలై 10న గ్రాండ్ రిలీజ్ కానుంది.








