ఓజీ సర్ప్రైజ్ నెక్ట్స్ లెవెల్ అట
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో రోజురోజుకీ ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఆయన సినిమా ఓజీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఓజీ సినిమాను ఆడియన్స్ ఎంతగానో ఆస్వాదిస్తారని పవన్ ఇప్పటికే ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు. ఇంకా సినిమాకు సంబంధించిన షూటింగ్ మిగిలి ఉండటంతో ఓజీని వచ్చే ఏడాదికి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.
ఇదిలా ఉంటే గతేడాది పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజైన హంగ్రీ చీతా టీజర్ తో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. ఆ టీజర్ లోని యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను మరింత మెప్పించాయి. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ టీజర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉండటం వల్ల టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మరోసారి పవన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా కొత్త వీడియోను రిలీజ్ చేయాలని దానిపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి రిలీజ్ చేయబోయే వీడియో మరింత పవర్ ప్యాక్డ్ గా ఉంటుందంటున్నారు. ఈ సరికొత్త వీడియో ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేస్తుందని, సెప్టెంబర్ 2న ఈ టీజర్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ మరింత ఉత్సాహంలో ఉంటారని, పవన్ క్రేజ్ ను ఈ టీజర్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందని యూనిట్ సభ్యులంటున్నారు.













