OG: పవన్ టార్గెట్ అదేనా?

అత్తారింటికి దారేది(Atharintiki Daredi) టైమ్ లో టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) టైర్1 హీరోల్లో టాప్ లో ఉన్నారు. ఆ టైమ్ లో ఎంతో పోటీని తట్టుకుని పవన్ ఆ స్థాయికి వచ్చారు. కానీ తర్వాత టాలీవుడ్ లో అగ్రస్థానం వద్దనుకుని, రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలపై ఫోకస్ తగ్గించారు పవన్. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ నుంచి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ఒక్కటి కూడా రాలేదు.
మధ్యలో పవన్ చేసిన సినిమాలు హిట్టయ్యాయి కానీ ఆడియన్స్ ఆకలిని మాత్రం ఆ సినిమాలు తీర్చలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) దెబ్బకి చాలా మంది ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు వారంతా ఓజితో గొంతు విప్పాలని చూస్తున్నారు. ఓజి(OG) సినిమా చాలా కాలం తర్వాత పవన్ నటిస్తున్న ప్రాపర్ కమర్షియల్ మూవీ కావడంతో అందరికీ దానిపైనే ఆశలున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన హైప్, కంటెంట్ అన్నీ వారి అంచనాలకు తగ్గట్టే ఉండటంతో పాటూ రీసెంట్ గా ఓజికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా, సేల్స్ స్టార్ట్ అయిన నిమిషాల్లోనే అవన్నీ సోల్డవుట్ అవుతున్నాయంటే సినిమా క్రేజ్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజ్ చూస్తుంటే పవన్, అతని ఫ్యాన్స్ టార్గెట్ డే1 రికార్డులు తమ పేరుకి మార్చుకోవడం ఖాయమనే అనిపిస్తుంది. చూడాలి మరి సెప్టెంబర్ 25న రిలీజయ్యే ఓజి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో.