OG: ఓజీ కు నార్త్ లోనూ మంచి డిమాండ్
రీసెంట్ గా పవన్ కళ్యాణ్(pawan kalyan) హరి హర వీరమల్లు(Hari hara veera mallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడందరి దృష్టి ఓజి(OG) పైనే ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్(Sujith) దర్శకత్వంలో వస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామా అయిన ఓజి సినిమాపై ముందు నుంచి భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజి సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
ఈ సినిమా లోని నటీనటులు, సినిమాకు వర్క్ చేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమా గురించి చిత్ర యూనిట్ చెప్తున్న మాటలు ఫ్యాన్స్ కు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓజి సినిమాకు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. గ్యాంగ్ స్టర్ డ్రామాలకు అసలే నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఓజి సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న విషయం తెలిసిందే.
ఆ కారణంతోనే ఓజి హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం పలువురు పోటీ పడగా ఆఖరికి ఆ రైట్స్ స్టార్ గోల్డ్ టీవీ ఛానెల్ దక్కించుకున్నట్టు సమాచారం. కానీ ఈ డీల్ ఎన్ని కోట్లకు ముగిసిందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఇటీవల కాలంలో ఏ సినిమాకూ రానంతగా ఈ డీల్ జరిగిందంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు.







