ఓజి విషయంలో రాజీ తప్పేట్టు లేదుగా
పవన్ కళ్యాణ్ ఇప్పుడెంతో బిజీగా ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా పలు కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ ఊపిరాడనంత తీరిక లేకుండా ఉన్నాడు. చూస్తుంటే ఇప్పట్లో మేకప్ వేసుకునేట్లు కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో పవన్ ఒక నెల డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తి చేయాలని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు, ఓజి సినిమాల దర్శకనిర్మాతలు మరికొన్నాళ్ల పాటూ వెయిట్ చేయక తప్పని పరిస్థితి.
ఈ రెండు సినిమాల్లో పవన్ ఫ్యాన్స్ కు ఓజి పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఓజికి సంబంధించి ఓ విషయంలో ఫ్యాన్స్ రాజీపడక తప్పేలా లేదు. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఓజిని రెండు భాగాలట. కానీ ఇప్పుడు పవన్ టైమ్ చాలా విలువైందిగా మారడంతో సీక్వెల్స్ కు టైమ్ దొరక్కపోవచ్చని టాక్.
ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఒక పార్ట్ కు మాత్రమే సరిపోయేలా ఉందట. ఎలాగూ పవన్ డేట్స్ అంత ఈజీగా దొరకవు కాబట్టి దానయ్య కూడా ఒక్క పార్ట్ తోనే సర్దుకోవడానికి రెడీ అయ్యాడట. అయితే ఈ సినిమాను రెండు భాగాలని మేకర్స్ ఎప్పుడూ అఫీషియల్ గా చెప్పింది లేదు. కానీ టీమ్ సభ్యులు చెప్తున్న ప్రకారమైతే ఓజి సబ్జెక్టు లో స్కోప్ ఉందట. ఏదేమైనా ఓజి ఒక భాగంగా వచ్చినా అది వచ్చేది 2025లోనే.













