పవన్ ఫస్ట్ ప్రియారిటీ ఆ సినిమానే!
ఏపీలో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు. జనసేనాని మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్ తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మళ్లీ ఎలక్షన్స్ అయ్యాకే మేకప్ వేసుకోనున్నాడు. ఈ మేరకు నిర్మాతలకు కూడా క్లారిటీ ఇచ్చాడు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.
ఎలక్షన్స్ లో టీడీపీ- జనసేన కూటమి పవర్ లోకి వచ్చినా సరే పవన్ ఈ మూడు సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మామూలుగా పవన్ మొదలుపెట్టిన దాన్ని బట్టి అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలున్నాయి. కానీ పవన్ ఎలక్షన్స్ నుంచి మళ్లీ సినిమా షూటింగ్ కు అందుబాటులోకి వచ్చాక మొదట ఓజీ సినిమాకే డేట్స్ ను ఇవ్వనున్నాడట.
పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఓజీనే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎలక్షన్స్ కు ముందు బ్రేక్ తీసుకునే లోపే ఓజీని పూర్తి చేయాలని పవన్ అనుకున్నాడు కానీ కుదరలేదు. దీంతో ఎలక్షన్స్ అవగానే పవన్ ఈ సినిమాను పూర్తి చేయనున్నాడట. జులై లోపు సినిమాను పూర్తి చేసి ఆగస్ట్ లో ఓజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉస్తాద్, హరిహర వీరమల్లును పూర్తి చేయనున్నాడట పవన్ కళ్యాణ్.













