OG: సలార్ సూత్రాన్ని ఫాలో అవుతున్న ఓజి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజిత్(Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి(OG) సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఓజి నుంచి వచ్చింది చిన్న టీజర్ మాత్రమే. ఒక్క టీజర్‌కే ఈ రేంజ్ హైప్ రావడమంటే మాటలు కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన థాయ్‌లాండ్(Thailand) లో జరుగుతుంది.
అయితే ఓజిలో నేహాశెట్టి(Neha Shetty) ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. కానీ అందులో పవన్ ఉండడట. కేవలం నేహా, మిగిలిన ప్రధాన క్యాస్టింగ్ మాత్రమే ఆ పాటలో కనిపించనున్నారట. ఇదంతా చూస్తుంటే ఓజి సినిమా సలార్(Salaar) ఫార్ములాని పాటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ సినిమాలో ప్రభాస్(Prabhas) చాలా లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు ప్రభాస్ డైలాగ్స్ తక్కువగా ఉండటంతో పాటూ స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువ.
ఇప్పుడదే సూత్రాన్ని సుజిత్ ఓజి కోసం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో పవన్ కనిపించి కనిపించనట్టు కీలక ఎపిసోడ్స్ లో విశ్వరూపం చూపించడం ద్వారా బలమైన ముద్ర వేస్తాడన్నమాట. ఓజీ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ముందు షూటింగ్ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉందని తెలుస్తోంది.













