OG: ఓజి, సాహో క్రాస్ ఓవర్ నిజమేనా?

గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఏ సినిమాకీ లేని హైప్, క్రేజ్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటించిన ఓజి(OG) సినిమాకు వచ్చాయి. సుజిత్(sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలుండగా, రీసెంట్ గా రిలీజైన ట్రైలర్(OG Trailer) సినిమాపై అంచనాలను ఇంకాస్త పెంచింది. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా, ట్రైలర్ చూశాక నెటిజన్లు కొన్ని విషయాలను డీకోడ్ చేశారు.
ఏ సినిమా ట్రైలర్ వచ్చినా సరే దాన్ని రకరకాల యాంగిల్స్ లో పరిశీలించి సినిమా కథను అల్లే బ్యాచ్ ఒకటి ఓజి లో కూడా అలాంటి ఓ విషయాన్ని కనిపెట్టింది. అదే వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనే బోర్డు. షిప్ యార్డ్ కంటైనర్ పై ఈ బోర్డ్ చూసి ఓజికి, సాహో(Saaho) సినిమాకు లింక్ ఉందని చెప్తూ స్టోరీలు అల్లుతున్నారు. అయితే మొదట్నుంచే ఓజికి, సాహోకి లింక్ ఉందని ఎంతోమంది అంటూ వచ్చారు.
కాగా ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఓజి సినిమాకీ, సాహో సినిమాకీ లింక్ ఉందని తెలుస్తోంది. అలా అని సాహో హీరో ప్రభాస్(Prabhas) ఓజిలో కనిపించడని అంటున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమై, సాహోకి, ఓజికి లింక్ ఉంటే మాత్రం ఇక ఓజి కలెక్షన్ల లెక్క ఎక్కడ ఆగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితులు నెలకొనడం ఖాయం. తమన్(Thaman) సంగీతం అందించిన ఈ సినిమాకు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్లు వేస్తున్నారు.