NTR: ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్!
ఆర్ఆర్ఆర్(RRR) తో నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్(NTR) గతేడాది కొరటాల శివ(Koratala Siva)తో దేవర(Devara) చేశాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న దాని కంటే బాగా లేటయ్యాయి. దీంతో ఎన్టీఆర్ ఇక మీదట చేయబోయే మూవీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ, ఇంతకుముందులా కాకుండా ఫాస్ట్ గా మూవీస్ చేయాలని చూస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఎన్టీఆర్ తన నుంచి రానున్న సినిమాల విషయంలో ఓ ప్లాన్ వేసుకుని దాని ప్రకారం వెళ్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాబోయే తన మూడు సినిమాలను మూడు పండగలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుంచి ముందుగా వార్2(War2) రిలీజ్ కానుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
వార్2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. వార్2 షూటింగ్ ముగించుకుని ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాను నవంబర్ లోపు పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు. ఇక ఎన్టీఆర్ చేతిలో ఉన్న మరో సినిమా దేవర2(devara2). ఈ సంవత్సరం జూన్, జులై నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది జనవరికి షూటింగ్ ను పూర్తి చేసి దసరాకు కు రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఏదేమైనా ఎన్టీఆర్ తర్వాతి సినిమాల రిలీజులను బాగానే ప్లాన్ చేశాడు.













