NTR: దేవరలానే నీల్ సినిమాలో కూడా ఆ సీన్లా?
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్(NTR), తన తర్వాతి సినిమాను కాస్త గ్యాప్ తీసుకుని కొరటాల శివ(Koratala Siva)తో తీశాడు. దేవర(Devara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి వార్2(war2) మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే వార్2 తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని పార్ట్ ను షూటింగ్ చేస్తున్నాడు నీల్. మార్చి లో జరగనున్న నెక్ట్స్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ కూడా ఈ షూట్ లో జాయిన్ కానున్నాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం వినిపిస్తోంది. దేవరలో లానే ఈ మూవీలో కూడా బీచ్ సన్నివేశాలున్నాయట. దాని కోసం నీల్ ఇప్పటికే ఏపీలో ఓ బీచ్ లొకేషన్ ను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది.













