పుష్ప-2లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప ది రూల్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఉండనే ఉంది.
రీసెంట్గా పుష్ప-2 సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడా లేదా అనే విషయంలో అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇప్పటివరకు బయటకు వచ్చింది లేదు.
కానీ తారక్ ఈ సినిమా షూటింగ్ కు రావడంతో కచ్చితంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే డౌట్లు అందరికీ వస్తున్నాయి. రీసెంట్గా స్టార్ హీరోలు మరో స్టార్ హీరో సినిమాలో కనిపించడం ట్రెండ్‌గా మారింది. ఇటీవలే పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ ఫార్ములాను ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఫాలో అవుతున్నారు.
ఈ క్రమంలోనే బన్నీ నటిస్తున్న పుష్ప-2లో తారక్‌ను చూపిస్తే సినిమాకు మరింత బజ్ పెరుగుతుందన్న ఆలోచనతో సుకుమార్ ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తుంది. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకుని పుష్ప2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్ మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం ఏమైనా స్పెషల్ రోల్ డిజైన్ చేశాడేమో చూడాలి.













