దేవర2పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి
ఈ ఇయర్ భారీ అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్(NTR) దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర(Devara) కోసం ఆడియన్స్ అంతా ఎగబడ్డారు. అన్నింటినీ తట్టుకుని దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
అలాంటి సినిమా ఓటీటీలోకి వచ్చాక మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. థియేటర్లలో ఉన్నప్పుడు నెట్టింట వచ్చిన నెగిటివిటీని ఫేస్ చేస్తూ సినిమాను తమ భుజాలపై మోసిన తారక్ ఫ్యాన్సే ఇప్పుడు దేవర గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా తాము ఆశించిన స్థాయిలో లేదని, క్లైమాక్స్ సరిగా కుదరలేదని, సెకండ్ పార్ట్ కు ఇచ్చిన లీడ్ సరిగా లేదని కొన్ని రోజులుగా పోస్టులు పెడుతున్నారు.
సరిగా చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనలో న్యాయముంది. అంతేకాదు ఎక్కువ మంది దేవర2పై సంతృప్తిగా లేనట్లే అనిపిస్తోంది. దేవరలానే దేవర2(Devara2) కూడా ఉంటే కష్టమని, అసలు సీక్వెల్ తీయకపోతే బెటర్ అని వారు భావిస్తున్నారు. దేవర1 హిట్ అయిన నేపథ్యంలో మేకర్స్ అయితే దేవర2 ప్లాన్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఇలా ఉంది. ఇవన్నీ చూసి నిర్మాతలు వెనుకడుగేస్తారా అన్నది చూడాలి.













