స్పీడు పెంచిన ఎన్టీఆర్.. 15 నెలల్లో 3 సినిమాలు
అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా వచ్చింది లేదు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా అని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేసేందుకు ఎన్టీఆర్ చేసుకున్న ప్లాన్ సూపర్ అనిపించేలా ఉంది. ఏడాది లేదా రెండేళ్లకో సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతున్న రోజుల్లో 15 నెలల్లో ఎన్టీఆర్ నుంచి ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు రానుండటం ఆషామాషీ విషయం కాదు.
సెప్టెంబర్ 27న కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్1 రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజయ్యాక హైప్ మరింత పెరగడం ఖాయం. నెక్ట్స్ ఇయర్ హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత మరో 5 నెలలు కాకముందే 2026 జనవరి 9న ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా రానుంది.
ఇప్పటివరకు చేసుకున్న ప్లాన్ అయితే చాలా పక్కాగా ఉంది. ఏదైనా షూటింగ్ లేటవడం వల్లనో లేకా ఇంకేమైనా అనివార్య కారణాల వల్లనో తప్పించి అనుకున్నది అనుకున్నట్లు అమలుపరిచాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. దేవర2 కూడా 2026లోనే వచ్చే ఛాన్సులున్నాయి. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్లు జాప్యం చేసిన ఎన్టీఆర్ ఇకపై కెరీర్ లో వేగంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.













