దేవర2 టెన్షన్ అక్కర్లేదు
దేవర(devara) సినిమా నెట్ఫ్లిక్స్(netflix) లో రిలీజయ్యాక దేవర2(Devara2) ఉంటుందా లేదా అని బాగా డిస్కషన్స్ జరిగాయి. డిజిటల్ లో దేవర చూశాక చాలా మంది సెకండాఫ్ పై నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థియేటర్లలో రిలీజైనప్పుడు కూడా ఈ మాట వినిపించింది కానీ ఆ టైమ్ లో ఎన్టీఆర్(ntr) నటన వల్ల సినిమా నిలబడి బ్లాక్ బస్టర్ అయింది.
అయినా సరే కొరటాల శివ(Koratala Siva) ఈ సినిమా సెకండాఫ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని అందరూ అన్నారు. దీంతో దేవర2 ఉండట్లేదని కొరటాల శివ వేరే ప్రాజెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. కానీ తారక్ సన్నిహిత వర్గాలు చెప్తున్న ప్రకారం దేవర2ను పక్కన పెట్టాలనే ఆలోచన ఎవరికీ లేదని తెలుస్తోంది.
కాకపోతే వెంటనే ఈ సినిమా తెరకెక్కదని సమాచారం. అందుకే తారక్ వార్2(war2) చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమా కూడా ఇప్పుడు ఒప్పుకుంది కాదు. కాబట్టి దేవర2(Devara2) విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కొరటాల రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. త్వరలోనే దేవర2 స్క్రిప్ట్ పై కొరటాల వర్క్ చేయనున్నాడట. కాబట్టి దేవర2 రావడానికి ఎన్నేళ్లు పడుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.













