దూత2కు టైమ్ లేదు
నాగచైతన్యకు వరుసగా ఫ్లాపులు పడుతున్న టైమ్ లో తను చేసిన డిజిటల్ డెబ్యూ దూత అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా జరిగిన అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్ లో దూత సిరీస్ కు సీక్వెల్ అనౌన్స్ చేస్తారని చాలా వార్తలు ముందు నుంచే వినిపించాయి. చైతూ ఈ ఈవెంట్ కు వెళ్లడానికి రీజన్ కూడా అదేనని అన్నారు.
కానీ ఈవెంట్ లో దూత సీక్వెల్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ దూత సిరీస్ ను సక్సెస్ చేసిందనందుకు డైరెక్టర్, హీరోని పిలిచి థాంక్స్ చెప్పి పంపించేశారు. దీని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది చైతూ డిజిటల్ స్పేస్ లో కంటిన్యూ కావాలని అనుకోకపోవడమే. దూత సిరీస్ కు డిమాండ్ ఉన్నప్పటికీ కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడయ్యాడట.
దానికి తోడు ప్రస్తుతం చైతూ ఫోకస్ అంతా తండేల్ మీదే ఉంది. తండేల్ మీద నమ్మకంతో కేవలం ప్రీ ప్రొడక్షన్ కే సంవత్సరం వెయిట్ చేశాడు. తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. పదే పదే బుల్లి తెరపై కనిపిస్తుంటే బిగ్ స్క్రీన్ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. ఇక డైరెక్టర్ విక్రమ్ కు కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. నితిన్‌తో ఓ సినిమాను ఇప్పటికే కమిట్ అయ్యాడు. ఇది కాకుండా నాగార్జునతో ఓ సినిమా, మీడియం రేంజ్ హీరోతో మరో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దూత2 తీసేంత టైమ్ లేదు. ఫ్యూచర్ లో టైమ్ దొరికినప్పుడు దూత బ్యాక్ డ్రాప్ లో మరో నాలుగు కథలు రెడీ చేస్తానని చెప్పిన విక్రమ్, వాటిలో హీరోగా చైతూనే కంటిన్యూ చేయిస్తాడా లేదా మరో హీరోతో ట్రై చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి ఇప్పట్లో అయితే మాత్రం దూత సిరీస్ కు సీక్వెల్ లేదు.













