సలార్-2 విషయంలో నో క్లారిటీ
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చి మంచి హిట్ అయిన సినిమా సలార్. ప్రపంచ వ్యాప్తంగా సలార్ రూ.730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం ఉంటుందని హింట్ ఇచ్చారు. సలార్ లో అలాగే వదిలేసిన చాలా ప్రశ్నలకు సీక్వెల్ లో సమాధానాలు చెప్పనున్నాడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేస్తామని నిర్మాత విజయ్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. కానీ సలార్-2కు సంబంధించిన షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక ప్రభాస్ సలార్-2ను సెట్స్ పైకి తీసుకెళ్తాడేమో చూడాలి.
మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఖాళీగానే ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సలార్-2 పూర్తి చేసే లోపు ఎన్టీఆర్ కూడా ఫ్రీ అవుతాడు కాబట్టి తన నెక్ట్స్ సినిమాను ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా యష్ తో కేజీఎఫ్3 కూడా ఉంటుందని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ సలార్-2 తర్వాతే ఉండే ఛాన్సుంది. కాబట్టి ప్రభాస్, సలార్-2 కోసం ఎప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేస్తాడో చూడాలి. సలార్-2 తర్వాత ప్రభాస్ స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు చేయాల్సి ఉంది.













