ప్రభాస్ సినిమాలో రెండో హీరోయిన్గా నివేదా థామస్?
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న `రాధేశ్యామ్` షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించిన ప్రభాస్ ఆ సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కే ఈ సినిమాను దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకొనే ఓ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్‌కి ఈ సినిమాలో ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ కోసం ఎంతో మంది పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ ఫైనల్‌గా నివేదా థామస్ పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `వి` చిత్రంలో నివేదా నటిస్తోంది. అలాగే పవన్‌కల్యాణ్ `వకీల్‌సాబ్`లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రభాస్ కొత్త సినిమాలో నివేదా నటించే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించే బాధ్యతను ఎ.ఆర్.రెహమాన్‌కు అప్పగించనున్నారని తెలుస్తోంది. మొదటి సారి ప్రభాస్ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రెహమాన్‌కు 4 కోట్ల రూపాయల భారీ ఆఫర్‌ను వైజయంతి మూవీస్ సంస్థ ఇచ్చింది. అయితే ఈ సినిమా రెహమాన్ ఈ సినిమా చేస్తాడా? చెయ్యడా? అనే విషయం తెలియాల్సి ఉంది. కరోనా సద్దుమణిగి షూటింగులు సజావుగా చేసుకోగలిగితే తప్ప `రాధేశ్యామ్`ను పూర్తి చేయలేమని చిత్ర యూనిట్ చెబుతోంది. అంతేకాదు షూటింగ్లో పాల్గొనేందుకు ప్రభాస్ కూడా సుముఖంగా లేడు. కాబట్టి రాధేశ్యామ్ ఎప్పడు పూర్తయితే అప్పుడు ప్రభాస్, నాగ్అశ్విన్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.













