Nivetha Pethuraj: దుబాయ్ లో నివేదా బ్యాచిలర్ పార్టీ?

మెంటల్ మదిలో(Mental Madilo) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) ఆ తర్వాత చిత్రలహరి(Chitralahari), బ్రోచేవారెవరురా(Brochevarevaru ra), అల వైకుంఠపురములో(Ala vaikunthapurramulo), దాస్ కా ధమ్కీ(Das ka Dhamki) లాంటి సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మెప్పించింది. అయితే నివేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ తనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది నివేదా.
దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రాజ్‌హిత్ ఇబ్రాన్(Rajhit Ibran) అనే వ్యక్తిని నివేదా పెళ్లి చేసుకోనుంది. పర్సనల్ లైఫ్ ను ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడే నివేదా, తన ఎంగేజ్‌మెంట్ ను కూడా చాలా సైలెంట్ గా చేసుకుని, ఆ విషయాన్ని సింపుల్ గా ఓ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో నివేదా పెళ్లి జరగనుందని వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే నివేదా ఇప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో పార్టీ చేసుకుంటూ కనిపించింది. దుబాయ్ క్రీక్ హార్బర్ లో నివేదా మరియు తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను నివేదా ఫ్రెండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, అవి చూసి సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టే నివేదా ఇప్పుడు సైలెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుందని అభిప్రాయపడుతున్నారు.
https://www.instagram.com/stories/nivethapethuraj/?hl=en