వెబ్ సిరీస్ లో నిత్యామీనన్
టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ భామ నిత్యామీనన్ సెలెక్టివ్‌గా సినిమాలను చేస్తోంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా నటనపై దృష్టి సారించిన నిత్య, మొదటి నుంచీ గ్లామర్ పాత్రలకు ఆమడదూరంలోనే ఉంటోంది. తమిళ, మలయాళ భాషల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న నిత్య మొదటిసారిగా బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ సరసన నటిస్తోంది. దాంతోపాటు ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించేందుకు ఓకె చెప్పిందట. తాను కీలక పాత్ర పోషించే ఆ వెబ్ సిరిస్ త్వరలోనే ప్రారంభంకానుందని, ఏ భాషలో తెరకెక్కుతుందోనని చెప్పలేనని ఓ ఇంటర్వ్యూలో తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో సావిత్రి పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ తమిళనాడు జయలలిత బయోపిక్‌లో జయ పాత్రలో కనిపించనుంది.













