గెస్ట్ రోల్ లో నిత్యా మీనన్
గత కొంత కాలంగా నిత్య మీనన్ నుంచి హిట్ సినిమాలు వచ్చింది లేదు. సినిమా ఛాన్సులు పెద్దగా రాకపోవడంతో టీవీ షోలతో బిజీ అయిన నిత్య వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. గతేడాది కేవలం ఒక్క సినిమాకే పరిమితమైన నిత్యా మీనన్ ఈ ఏడాది మళ్లీ యక్టివ్ అవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జయం రవి సరసన కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న నిత్య, డియర్ ఎక్సెస్ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇతర భాషల్లో సినిమా ఆఫర్లొస్తున్నప్పటికీ అమ్మడికి తెలుగు నుంచి మాత్రం హీరోయిన్ గా ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. తాజాగా నిత్యాకు టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్ హీరోయిన్ గా కాదట.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు సినిమాలో గెస్ట్ రోల్ కు నిత్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే వేణు, నిత్యాకు ఆ క్యారెక్టర్ గురించి వివరించి లాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో నితిన్ తో కలిసి రెండు సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్న నిత్యా మీనన్ ఇప్పుడు అదే హీరో సినిమాతో గెస్ట్ రోల్ లో నటించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













