VI Anand: నితిన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నా
టాలీవుడ్ లో తనకంటూ డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్లలో విఐ ఆనంద్(VI Anand)మూవీస్ లాంటి డిఫరెంట్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ నుంచి ఆఖరిగా ఊరు పేరు భైరవకోన(ooru peru bhairavakona) మూవీ వచ్చింది.
సందీప్ కిషన్(sundeep kishan) హీరోగా వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకోగా, ఆ తర్వాత నుంచి ఆనంద్ మరో సినిమాను అనౌన్స్ చేసింది కానీ, చేస్తున్నది కానీ లేదు. తన రైటింగ్, డైరెక్షన్ తో విభిన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆనంద్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నారో రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ హీరో నితిన్(nithin) తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఆనంద్ వెల్లడించారు.
అల్లరి నరేష్(Allari naresh) నటించిన 12ఎ రైల్వే కాలనీ(12A Railway station) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆనంద్ తన తర్వాతి సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్(Srinivasa sivler screens) బ్యానర్ లో నితిన్(nithin) తో ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఆల్రెడీ సినిమా ఓకే అయిందని, నితిన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. గత కొన్ని సినిమాలుగా ఏం చేసినా ఫ్లాపే అవుతున్న నితిన్ కు ఈ డైరెక్టర్ అయినా హిట్టిస్తాడేమో చూడాలి.






