Nithin: ఆ డైరెక్టర్ పైనే నితిన్ ఆశలన్నీ!

యంగ్ హీరో నితిన్(Nithin) కు సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. భీష్మ(Bheeshma) తర్వాత నితిన్ కు మరో హిట్ పడింది లేదు. మ్యాస్ట్రో(mastro), మాచర్ల నియోజకవర్గం(Macherla Niyojakavargam), ఎక్స్‌ట్రా ఆర్డినరీ(Extraordinary), రాబిన్‌హుడ్(Robinhood), తమ్ముడు(Thammudu) సినిమాలన్నీ నితిన్ కు ఫ్లాపులనే మిగిల్చాయి. దీంతో నితిన్ చాలా మార్కెట్ చాలా పడిపోయింది. అందుకే ఇప్పుడు నితిన్ కు అర్జెంటుగా ఓ హిట్ అవసరం.
ఆ హిట్ కోసం నితిన్, తనకు గతంలో మంచి బ్లాక్‌బస్టర్ ను అందించిన డైరెక్టర్ తోనే చేతులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇష్క్(Ishq) సినిమాతో నితిన్ కు మంచి హిట్ ను ఇచ్చిన విక్రమ్ కె. కుమార్(Vikram k Kumar) తో నితిన్ తన తర్వాతి సినిమాను చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు స్వారీ(Swari) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని, ఇప్పటికే ఈ కాంబినేషన్ లో సినిమా కూడా లాక్ అయిందని అంటున్నారు.
అయితే స్వారీలో కేవలం క్రీడలకు సంబంధించిన అంశాలను మాత్రమే కాకుండా మానవ ఎమోషన్స్, సంబంధాలను కూడా విక్రమ్ చూపించనున్నాడని తెలుస్తోంది. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు ఇష్క్ లాంటి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కించిన విక్రమే మరోసారి నితిన్ ను సేఫ్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తాడేమో చూడాలి.