11న నిశ్శబ్దం ఫస్ట్‌లుక్
స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చాన్నాళ్ల తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. సినిమాలో అనుష్క పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల కానుంది. ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్టు కోసం స్వీటీ బరువు కూడా తగ్గి స్లిమ్ అయింది. ఇందులో ఆమె ఎన్నారై బిజినెస్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మాధవన్, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మడిసెన్ కీలక పాత్రలు చేస్తున్నారు.













