ఆదిపురుష్ రిజల్ట్ పై ఆధారపడ్డ స్పై రిలీజ్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న సినిమా స్పై ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ మారే అవకాశాలున్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమీ లేదని చిత్ర యూనిట్ ఆ వార్తలను కొట్టిపారేసింది. అయితే రిలీజ్ కు దగ్గర పడుతున్నా స్పై యూనిట్ ఇప్పటి వరకు ప్రమోషన్లను మొదలుపెట్టకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.
అందులో మొదటిది ఆదిపురుష్ రిలీజ్ ఉండటం. 16వ తేదీన ఆదిపురుష్ రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదిపురుష్ పైనే ఉంది. మూవీ లవర్స్ పాటూ సగటు హిందుత్వ వాదులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ఓపెనింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అన్నది ఇప్పటికే ఖాయమైంది. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఈ మూవీ కనీసం రెండు మూడు వారాల పాటూ థియేటర్లలో తిష్ట వేయడం గ్యారెంటీ.
ఇలాంటి టైమ్ లో స్పై ని వారం గ్యాప్ తో రిలీజ్ చేయడమంటే నిర్మాతలు రిస్క్ తీసుకున్నట్లే అనుకోవాలి. దానికితోడు హిందీలో థియేటర్లకు ఇబ్బంది తలెత్తే ప్రమాదముంది. అందుకే ఈ రిస్క్ ని మైండ్ లో పెట్టుకుని నిర్మాతలు వెయిట్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు ప్రస్తుతం ఆదిపురుష్ మానియా లో స్పై కి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసినా వాటిని పట్టించుకునేవారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అందుకే ఆదిపురుష్ రిలీజ్ వరకు వెయిట్ చేసి రిలీజ్ డేట్ ను, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారట స్పై మేకర్స్.













