Nidhhi Agerwal: వీరమల్లు టీజర్ లో చూసింది శాంపిలేనట!
పవన్ కళ్యాణ్(pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ఒకటి. ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరమల్లులోని కొల్లగొట్టినాదిరో(
వీరమల్లు టీజర్ లో ఆడియన్స్ చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, సినిమాలో ఇంకా ఎన్నో సర్ప్రైజ్లను ఆడియన్స్ కోసం దాచిపెట్టినట్టు నిధి వెల్లడించింది. ఇప్పటివరకు వీరమల్లు నుంచి దేన్నీ పెద్దగా రివీల్ చేయలేదని, సినిమాలో ఎన్నో ట్విస్టులుంటాయని నిధి తెలిపింది. ఈ సినిమా కథ ఎక్కడా సాగదీసినట్టు అనిపించదని, వీరమల్లు స్క్రీన్ ప్లే చాలా బావుంటుందని నిధి చెప్పింది.
సెకండ్ సాంగ్ గా రానున్న కొల్లగొట్టినాదిరో పాటను చాలా భారీ సెట్ లో షూట్ చేశారని, ఇదొక డ్యాన్స్ నెంబర్ అని, వీరమల్లులో ఈ పాటతో పాటూ మరికొన్ని డ్యాన్స్ సాంగ్స్ ఉన్నాయని, ఫ్యాన్స్ కు మాస్ ఎలిమెంట్స్ విషయంలో లోటే ఉండదని, దీనికంటే వీరమల్లు గురించి తాను ఎక్కువ మాట్లాడకూడదని నిధి చెప్పింది.













