ఆ జంటలతో రియాల్టీ షో …. ప్రియాంక
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ తమ వివాహానికి ముందు నుంచి కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచన చేస్తూ ఉండేవారట. అది ఏమిటన్నది మాత్రం ఇప్పటి వరకూ సృష్టత రాలేదు. వివాహం తర్వాత వీరు గడిపిన అనుభవాలు ఆధారంగా ఓ ఆలోచనైతే తట్టింది. పెళ్లిన జంటలతో రియాల్టీ షో చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వచ్చిన ఆలోచనకు ప్రముఖుల అభిప్రాయాలు సేకరించారు. అంతా సానుకూలంగా స్పందించడంతో ఆ షో చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి ఏ వీక్ టు సంగీత్ అనే పేరు పెట్టారు. ఇందులో అందరూ నూతంగా వివాహం చేసుకున్న దంపతులు పాల్గొంటారు. ముందుగా సెలబ్రిటీలకు ప్రాధాన్యముంటుంది. అయితే క్రమేణా అన్ని రకాల వయసుల వారికి అవకాశం ఇచ్చేలా ఈ రియాల్టీ షోను డిజైన్ చేశారట. బహుశా ఈ షోలో పాల్గొన్న వారు వారం రోజులు షో ఉండాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇందులో పాల్గొనేవారంతా నృత్య, వివిధ అభిరుచులపై పోటీలు నిర్వహిస్తారట. వీటన్నంటి ఆధారంగా విజేతలను ప్రకటించనున్నారు. ఈ షోలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంటలు పాల్గొనున్నాయి. నిక్ జొనాస్, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఈ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు.













