సుధీర్ ను తిట్టిపారేస్తున్న నెటిజన్లు
స్వామి రారా మూవీతో టాలీవుడ్లోని అందర్నీ తన వైపు చూసేలా చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ. టాలీవుడ్లో థ్రిల్లర్ మూవీలకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న సినిమాగా నిలిచింది స్వామి రారా. క్వింటన్ టొరంటినో, ఆర్జీవీ లాంటి డైరెక్టర్ల ప్రభావం తన మీద ఉందన్న విషయాన్ని చెప్పడమే కాకుండా, కాపీ కొట్టడానికి అసలు వెనుకాడనని అతను పేర్కొన్నాడు.
మొదటి సినిమా తర్వాత అతడి మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ సినిమా వచ్చి పదేళ్లు గడిచిపోగా, ఇప్పటిదాకా మళ్లీ దానికి దరిదాపుల్లో నిలిచే సినిమా ఏదీ తీయలేకపోయాడు సుధీర్. కేశవ, రణరంగం లాంటి సినిమాలు చూసినప్పుడు టేకింగ్ పరంగా బాగుందనిపించుకున్నా, మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకోలేకపోవడమే సుధీర్ ప్రాబ్లమ్ అనుకున్నారు.
కానీ రీసెంట్గా రిలీజైన రావణాసుర చూశాక సుధీర్ టేకింగ్ సహా అన్నీ విషయాల్లో పట్టు కోల్పోయాడని చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లైతే సుధీర్ వర్మ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పెద్దగా జనాల దృష్టిలో పడకుండానే ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. కాన ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా, మరోసారి సుధీర్ మీద నెటిజన్లంతా విరుచుకుపడుతున్నారు.
స్వామిరారా లాంటి సినిమాను తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీశాడా అని కొందరు, మినిమం లాజిక్ లేకుండా మాస్క్ కాన్సెప్ట్ ను డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత సిల్లీగా సినిమా ఎలా తీశావ్ సుధీర్ అంటూ నెటిజన్లు డైరెక్ట్ గా ట్యాగ్ చేసి అతణ్ని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు అతణ్ని అభిమానించిన వాళ్లే ఇప్పుడు తనపై విరచుకుపడుతున్నారు.













