Nenu Ready: హవీష్, కావ్య థాపర్, త్రినాథరావు నక్కిన ‘నేను రెడీ’ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘నేను రెడీ’ (Nenu Ready). కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైయింది. హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నేను రెడీ కోసం త్రినాథరావు నక్కిన తన మార్క్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది.
ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం నటిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్.. ప్రముఖనటులంతా కీలకమైన పాత్రల్లో అలరించబోతున్నారు
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. స్టార్ కంపోజర్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిజార్ షఫీ డీవోపీ. ప్రవీణ్ పూడి ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ రఘు కులకర్ణి. విక్రాంత్ శ్రీనివాస్ కథ, డైలాగ్స్ అందిస్తున్నారు.