నేను కేరాఫ్ నువ్వు సెన్సార్ పూర్తి
రతన్ కిషోర్, సవ్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ తదితరులు ప్రధాన తారాంగ రూపొందుతున్న చిత్రం నేను కేరాఫ్ నువ్వు. సాగారెడ్డి తుమ్మ దర్శకుడు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతవుల శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మించారు. చిత్ర వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ పాల్గొని యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఒక యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించాం. 1980లో జరిగిన కథ. పల్లెటూరులో పేదింటి అబ్బాయి, ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన కథ అని చెప్పార. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని రచయిత ప్రణవం తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఇందులో విలన్ పాత్రలో కూడా నటించాను. ప్రేమ మనిషిని జయిస్తుందనేది సినిమాలో చూపిస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.కృష్ణాప్రసాద్, సంగీతం: ఎస్ఆర్.రఘునందన్.













