భోళా శంకర్ మరో ఆచార్య అవుతుందా?
ఆచార్య సినిమా డిజాస్టర్ ను పెద్దగా పట్టించుకోకుండా చిరంజీవి బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేసి ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్లో చిరూ, ప్రస్తుతం మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలేమీ లేవు.
దానికి ప్రధాన కారణం ఈ సినిమా రీమేక్ కావడమే. అది కూడా ఎప్పుడో వచ్చిన ఓ రొటీన్ మాస్ సినిమాను ఇప్పుడు చిరూ కొత్తగా రీమేక్ చేయడాన్ని సదరు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు ఈ సినిమాను అసలు పదేళ్ల పాటూ ఏ సినిమా తీయని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడం.. ఇలా ఈ రీజన్స్ వల్ల భోళా శంకర్ మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
కానీ మెహర్ ను నమ్మి తమ హీరో చిరూ సినిమాను ఆయన చేతుల్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాను ఎలాగో భరిద్దాంలే అనుకున్నారు మెగా ఫ్యాన్స్. అలాంటి మెగా ఫ్యాన్స్ కు టీజర్ చూశాక నిరాశే మిగిలింది. ఇలాంటి రొటీన్ సినిమాను చిరూ చేశాడని టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. టీజర్ తోనే సినిమా పరిస్థితేంటో తెలిసిపోతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
దానికి తోడు చిరూకు తెలంగాణ స్లాంగ్ కుదరకపోవడం, డైలాగ్ డెలివరీ కూడా తేడాగా ఉండటంతో భోళా శంకర్ సినిమాపైనే నెగిటివిటీ పెరిగిపోతుంది. అంతే కాదు ఈ సినిమా ట్రోల్ మెటీరియల్ అవుతుందోమేనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో అని కొందరు అంటుంటే, ట్రైలర్ తో మెప్పించకపోతే భోళా శంకర్ మరో ఆచార్య కావడం ఖాయమని మరికొందరంటున్నారు.













