Janhvi Kapoor: ఆస్కార్ కు ఎంపికైన జాన్వీ సినిమా

రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్(RRR) లోని నాటు నాటు(naatu naatu) సాంగ్ ఆస్కార్(Oscar) కు నామినేట్ అయి, ఆ తర్వాత అవార్డును కూడా అందుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియాకు ఏ సినిమా తీసుకొస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ జాన్వీ కపూర్ నటించిన సినిమా ఆస్కార్ కు నామినేట్ అవడం అందరినీ ఎగ్జైట్ చేస్తోంది.
నీరజ్ గైవాన్(neeraj gywan) దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్(Ishan Khattar), విశాల్ జత్వా(vishal jatwa) మెయిన్ రోల్స్ లో నటించిన హోమ్ బౌండ్(Home Bound) మూవీ 2026 అకాడమీ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంట్రీ దక్కించుకున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఆనందిస్తూ ఆ సక్సెస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇప్పటికే పలు రికార్డులు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ కు ఎంపికవడంతో మరో రికార్డు సృష్టించినట్టైంది. హోమ్ బౌండ్ లో భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్తున్న జాన్వీ కపూర్, ఈ మూవీని తన లైఫ్ కు ఓ గొప్ప రివార్డుగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 26న ఈ సినిమా రిలీజ్ కానుండగా, ఇప్పటికే ఈ మూవీ మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) లో స్క్రీనింగ్ జరుపుకుంది. టోరంటో(Toranto) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పీపుల్స్ ఛాయిస్ విభాగంలో సెకండ్ రన్నరప్ అవార్డును కూడా ఈ మూవీ దక్కించుకుంది.