డ్రగ్స్ ఉచ్చులో బాలీవుడ్ విల విల
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు కొంత మంది పేర్లు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. త్వరలోనే బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ని కూడా విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ విచారణ ముగిసింది. కాసేపటి క్రితం వారిద్దరి విచారణను ముగించి తిప్పి పంపించింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. త్వరలోనే మరికొంత మందిని కూడా విచారించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని పేర్లు ఆధారంగా చూస్తే బాలీవుడ్ లో త్వరలోనే ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాతలు కొంత మందిని ఇప్పటికే బ్యూరో నోటీస్ చేసిందని త్వరలోనే వారందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అదే విధంగా దీపిక భర్త రణవీర్ సింగ్ ని కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. రణవీర్ సింగ్ విషయంలో ఇప్పటికే కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరి కొంతమందిని అతనితో కలిసి విచారిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది.2019లో కరణ్ జోహార్ ఒక పార్టీ ఇచ్చాడు అని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. దీనితో రేపోమాపో కరణ్ జోహార్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తన వద్ద రియా చక్రవర్తి డ్రక్స్ దాచుకుంది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీపికా పదుకొనే ఇప్పుడు ఏం చెప్పింది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొన్ని అరెస్టులు కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని అరెస్టు చేసే అవకాశం ఉందని కొంతమంది వార్తలు కూడా ప్రచురించారు.













