NC24: సగం షూటింగ్ ను పూర్తి చేసేసిన చైతూ

కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya)కు తండేల్(thandel) మూవీ సక్సెస్ చాలా రిలీఫ్ ను ఇచ్చింది. ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు చైతన్య. తండేల్ తర్వాత చైతూ విరూపాక్ష(virupaksha) ఫేమ్ కార్తీక్ దండు(karthik dandu) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిథికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా మొదలై ఇప్పటికే ఆరు నెలలు దాటింది.
చైతన్య కెరీర్లో 24వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే ఆరు నెలలవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ పై ఓ అప్డేట్ వినిపిస్తోంది. NC24 షూటింగ్ 50% పూర్తైందని తెలుస్తోంది. నవంబర్ 16 నుంచి చైతన్య, మీనాక్షి, జయరాం(jayaram), వైవా హర్ష(Viva harsha)పై ఓ 6 రోజుల షూటింగ్ ను చేయనున్నారట మేకర్స్.
ఈ షెడ్యూల్ తో సినిమా కోసం స్పెషల్ గా వేసిన గుహ సెట్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. NC24 కోసం అన్నపూర్ణ స్టూడియోస్(annapurna studios) లో ఓ భారీ గుహను సెట్ గా వేసిన విషయం తెలిసిందే. అజనీష్ లోకనాథ్(Ajaneesh lokanath) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.