బాలయ్య షూటింగ్ లో జాయిన్ అయ్యేదెప్పుడంటే?
సినిమాలతో పాటూ రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన అభిమానులు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎలక్షన్స్ హంగామా ముగిసింది. దీంతో బాలయ్య ఎప్పుడెప్పుడు మళ్లీ షూటింగ్ మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా సెట్స్ లో జాయిన్ అవడానికి రెడీ అయ్యాడట.
ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టమని ఇప్పటికే బాలయ్య చిత్ర యూనిట్ కు మెసేజ్ ఇచ్చాడట. నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని ప్రత్యేకమైన సెట్స్ లో మొదలుపెట్టనున్నారట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆ సెట్ వర్క్స్ లోనే బిజీగా ఉంది. ఈ నెలాఖరు లోపు ఆ పనులను పూర్తి చేస్తే షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తారు.
మొదలు పెట్టిన దగ్గరనుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేయనున్నారట. ఈ షెడ్యూల్ లో బాలయ్యపై కీలక సీన్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట బాలయ్య. వీరమాస్ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా పూర్తవగానే బాలయ్య, బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.













