లేడీ సూపర్ స్టార్ రోల్ ఇదేనా ?
రజినీకాంత్ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే నెల 9న పలు భాషలలో గ్రాండ్‌గా విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3వ తేదీన హైదరాబాద్‌లో కూడా నిర్వహించనున్నారని సమాచారం. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మొదటిసారి రజినీతో ఈ చిత్రం చేస్తున్నారు. ఆయన రజనీ కానీ ఓరూత్ లెస్ బాడ్ పోలీస్ అధికారిగా చూపించనున్నారని సమాచారం. ఇక మూవీ ముంబై మాఫియా నేపథ్యంలో నడుస్తుంది. దీనితో చిత్ర అధిక భాగం ముంబైలో చిత్రీకరించారు. కాగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ భార్య పాత్ర చేస్తున్న నయనతార వృతి రీత్యా ఆర్కిటెక్‌గా కనిస్తారట. కథలో ఆమె పాత్ర కూడా చాలా కీలకం అని తెలుస్తుంది.













