సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తనదే హవా!!
తెలుగు, తమిళంలో తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార, యువ హీరోయిన్లతో పోటాపోటీగా తన గ్లామర్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. సహజంగా పెళ్లయ్యాక సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గుతాయి. కానీ నయనతారకి మాత్రం పెళ్లి తరువాత కూడా తన చేతి నిండా సినిమాలు ఉండేటట్లు కెరీర్ను మెయింటెయిన్ చేస్తుంది.
తాజాగా తాను నటించిన ‘జవాన్’ మూవీ హిట్ అవ్వడంతో నయన్ వెంట హిందీ డైరెక్టర్స్ కూడా క్యూ కడుతున్నారనే చెప్పాలి. తన రెమ్యూనరేషన్ పది కోట్ల వరకు వసూలు చేస్తుంది. దాంతో పాటు అదనంగా మరొక కోటి జీఎస్టీ. ఇంత పారితోషికం ఒక మీడియం స్టార్ హీరోకి ఇవ్వడమే అసాధారణం. అలాంటిది పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లి అయిన నయన్ ఇప్పటికీ తన మార్కెట్ ను ఈ రేంజ్లో కాపాడుకుంటుందంటే గ్రేట్ అనే చెప్పాలి.
ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా కొన్ని సినిమాలకు మాత్రమే నయన్ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుందని సమాచారం. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ముందుకు సాగిపోతున్న ఈ అమ్మడు జయం రవితో నటించిన ‘ఇరైవర్’ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇవి కాకుండా మరో రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా తను సైన్ చేసింది. మెగాస్టార్ 157 సినిమాకి నయనతారని సెలెక్ట్ చేసుకోగా నయన్ తన అభిప్రాయాన్ని ఇంకా వ్యక్త పరచలేదు. పెళ్లి అయ్యాక సినిమాలు రావడం కొంతమందికే వరిస్తుంది. ఆ లిస్ట్ లో సమంత కూడా ఒకరు. కానీ సమంత మాత్రం నయనతారలా అన్ని పాత్రలు చేసే సమర్ధత ఉందని పూర్తిగా చెప్పలేం. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నయనతారదే పై చేయి. ఆ తరువాతనే త్రిష,కాజల్, తమన్నాలు వరుసలో ఉన్నారు.













