హీరో పారితోషకాన్ని మించి డిమాండ్ చేసిన నాయన తార
నయన్ తార వ్యవహారం పూర్తిగా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాను బట్టి, తన అవసరాన్ని బట్టి పారితోషికం మారుస్తూ వుంటుంది. లేటెస్ట్ గా తెలుగులో చేసిన సైరా సినిమాకు ఏ మేరకు పారితోషికం ఇచ్చారో తెలియదు కానీ, అంథాదూన్ హిందీ మూవీ రీమేక్ కు ఆమెను సంప్రదిస్తే చెప్పిన పారితోషికం నిర్మాత సుధాకర రెడ్డి కి షాక్ కొట్టించిందని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం నయన్ కోట్ చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సినిమాకు కీలకమైన పాత్ర, నయన్ అయితే బాగుంటుంది కనుక, హీరో నితిన్ కూడా ఆసక్తి చూపించడంతో, ఆఖరికి అయిదు కోట్ల వరకు ఆఫర్ చేసారట.
కానీ నయన్ నో అనేసిందట. దాంతో కాస్త అటు ఇటుగా ఏమన్నా ఓకే అంటుందేమో అన్న ఆశతో వుందట అంథాదూన్ యూనిట్. హీరో నితిన్ శ్రేష్ఠ మూవీస్ స్వంత సినిమా ఇది. అయినా నితిన్ పారితోషికమే అయిదు కోట్ల మేరకు లేదు. ఏడు కోట్లు అయితే ఓకె అంటుందేమో? అయినా సరే నయనతారకు ఇవ్వడానికి సిద్దపడ్డారు, కానీ ఫలితం దక్కలేదు. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసాడు. కానీ మరీ అంత ఇచ్చే బదులు హిందీలో ఆ క్యారెక్టర్ ను చేసిన టబునే తెచ్చుకుంటే, చాలా తక్కువలో అయిపోతుందనే ఆలోచన కూడా వుందని వినిపిస్తోంది.













