నవీన్ ఈసారైనా హిట్ కొడతాడా?
కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడంటే కచ్ఛితంగా అతని దగ్గర ఏదో గట్టి విషయం ఉందనుకుంటేనే ఇస్తాడు. అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కళ్యాణ్ రామే. ఈ సినిమా తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత పటాస్‌తో అనిల్ రావిపూడిని పరిచయం చేశాడు.
ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. రీసెంట్గా బింబిసారతో వశిష్ఠని పరిచయం చేశాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్‌తో గతంలో బాబు బాగా బిజీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నవీన్ అంతకంటే ముందు హాలీవుడ్లో సినిమాలు చేశాడు.
అంతేకాదు హ్యారీపోటర్, బ్యాట్‌మెన్, ఐరన్ మెన్2, 10000బీసీ, ఎక్స్‌మెన్ లాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. వీఎఫ్ఎక్స్ విషయంలో నేర్పరి అయిన నవీన్ తన మూడో సినిమానే కళ్యాణ్ రామ్‌తో డెవిల్ అనే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు.
రీసెంట్గా డెవిల్ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఇండియా తరపున పనిచేసే సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాబు బాగా బిజీ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న నవీన్ కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.













