యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన ‘నాట్యం’ టీజర్
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు వెండితెరకు పరిచయం అవుతోన్న చిత్రం ‘నాట్యం’. ఈ చిత్రం ద్వారా రేవంత్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సంధ్యా రాజు కార్యాయానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్.. అక్కడ నటరాజ స్వామి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం టీజర్‌ను విడుదల చేశారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని సంధ్య రాజు నిర్మాతగా నిశృంఖ ఫిలిమ్స్ అనే బ్యానర్లో నిర్మించారు.
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ` ‘‘తెలుగు ప్రేక్షకుల మనసు చాలా పెద్దవి. పెద్ద సినిమాలు , చిన్న సినిమాలు అనే వ్యత్యాసం వాళ్లు చూపించరు. వాళ్లకు సినిమా నచ్చితే కొత్త వాళ్లను కూడా ప్రోత్సహిస్తారు, ఆశీర్వదిస్తారు’’ అన్నారు.
నాట్యం టీజర్ పేరుకి తగ్గట్టుగానే ప్రేక్షకుకు హంపి, లేపాక్షి, బెంగళూరు వంటి చారిత్రాత్మక ప్రదేశాలో షూటింగ్ జరుపుకుంది. సినిమా విజువల్స్ అందమైన నృత్యాలతో పాటు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో అద్భుతమైన సెట్స్‌తో మన తెలుగు తనాన్ని చాటుతూ మైమరిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్న రేవంత్ కోరుకొండ ‘ఒక కొత్త కథతో వస్తున్నాం..! అని చిత్రం పట్ల విశ్వాసం కనపరిచారు. క్లాసికల్ డాన్స్ ఆధారంగా వస్తున్న ఈ అద్భుత చిత్రాన్ని సృష్టించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి కథ అందించి, దర్శకత్వం చేయడమే కాకుండా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు ఎడిటర్ కూడా తానే అవ్వడం గమనార్హం. నాట్యం టీజర్‌తో చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. కూచిపూడి నర్తకిగా మనకి పరిచయం ఉన్న సంధ్య రాజు ఈ టీజర్లో కూడా తన అద్భుత అభినయంతో, అందమైన తొగమ్మాయిగా ప్రేక్షకుని అరించారు.
చిత్ర సీమకు ఈ యువనర్తకి నూతన పరిచయం అయినప్పటికీ, ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌తో పాటూ, ప్రతి పాటకు కొరియోగ్రఫీ బాధ్యతలు కూడా తీసుకోవడం ఆశ్చర్యంగొలిపే విషయం. మొత్తానికి మన తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నో క్లాసికల్ డాన్స్ సినిమాు హిట్ కొట్టిన తర్వాత కొన్ని దశాబ్దాలకి మళ్ళీ అలాంటి జానర్‌తో మన ముందుకు వచ్చి.. ప్రేక్షకుల హృదయాల్ని ఆ గతానికి తీసుకువెళ్లారు.! అనడంలో ఆశ్చర్యం లేదు. మన తెలుగు తనం చాటి చెప్పే ఇలాంటి చిత్రాల నేటి తరానికి నచ్చేలా, మైమరిపించేలా ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రావడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం అనే చెప్పాలి .ఈ చిత్రంలో తన ట్యూన్లతో క్లాసికల్ మరియు చిత్ర పాటలను బ్యాలెన్స్ చేస్తూ అద్భుత సంగీతాన్ని సృష్టించారు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరధ్వాజ్ ఆదిత్య మీనన్, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియా, శుభలేఖ సుధాకర్ రుక్మిణి విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రల్లో నటించారు.













