ముందుగానే రానున్న హాయ్ నాన్న
నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా మొదట్లో అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. హాయ్ నాన్న జనవరి 4 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది.
కానీ సడెన్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ తో పాటూ సదరు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. డిసెంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన హాయ్ నాన్న నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే దీనికి కారణం ముందుగానే జరిగిన ఓటీటీ డీల్ యేనని తెలుస్తోంది. మొదటి రెండు వారాల్లోనే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది.
సలార్ వచ్చాక కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు హాయ్ నాన్న నే ఆప్షన్ గా మారింది. ఈ కారణం వల్లే ఇప్పటికీ హాయ్ నాన్న థియేటర్లలో రన్ అవుతుంది. ఆడియన్స్ ను ఎమోషన్స్ తో కదిలిస్తే సక్సెస్ తప్పకుండా వస్తుందని హాయ్ నాన్న నిరూపించింది. శౌర్యువ్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ తన కథను డీల్ చేసిన విధానం అందరినీ మెప్పించింది.













