లాభాల దిశగా హాయ్ నాన్న ప్రయాణం
సలార్ సినిమాకు రెండు వారాల ముందు, యానిమల్ రిలీజ్ అయ్యాక వారానికే హాయ్ నాన్న ను రిలీజ్ చేస్తారని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. నాని ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడనుకున్నారు. కానీ తన నిర్ణయం సరైనదేనని హాయ్ నాన్న కు వస్తున్న కలెక్షన్స్ తో నాని సమాధానం చెప్పాడు. హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వీక్ పూర్తి కాక ముందే బ్రేక్ ఈవెన్ చేరుకుంది.
ఇప్పటికే హాయ్ నాన్న రూ.28 కోట్ల షేర్ ను సంపాదించి లాభాల దిశగా అడుగులేస్తున్నాడు. దానికి తోడు ఈ వీకెండ్ కలెక్సన్స్ కూడా చాలా బాగున్నాయి. గత 24 గంటల్లో బుక్ మై షో లో ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ గా లక్షకు పైగా అమ్ముడయ్యాయంటే హాయ్ నాన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే సండే ఒక్కరోజు గ్రాస్ కోటి రూపాయలు దాటడం అంటే మాటలు కాదు.
దీంతో పాటూ రిలీజైన ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ రెండో రోజుకే డిజాస్టర్ దిశగా అడుగులేయడం, హాయ్ నాన్న కు మరింత కలిసొచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా 1.6 మిలియన్ డాలర్లు దాటేసింది. సలార్ రిలీజయ్యే లోపు 2 మిలియన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ లాంటి నెలలో కూడా నాని ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే మాటలు కాదు. అంతేకాదు ఎమోషనల్ సినిమాలను ఆడియన్స్ ఎప్పటికీ ఆదరిస్తారని నాని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు.













