నాని32 ఆగిపోలేదు
నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో నాని32గా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్, వీడియో రిలీజ్ అయింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి డీవీవీ దానయ్య తప్పుకున్నారని టాక్ వచ్చింది.
దీంతో నాని- సుజిత్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని, సినిమా ఆగిపోయిందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం నాని32 రద్దు కాలేదని, మరో కొత్త నిర్మాత ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ కథను, అందులో తన పాత్రను నాని ఎంతో ఇష్టపడ్డాడని అందుకే నిర్మాత తప్పుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ను చేయాలని నాని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి. ఈ సినిమాలో హీరో మొదట్లో హింసాత్మక వ్యక్తిగా కనిపించి ఆ తర్వాత మారిపోయే పాత్రలో కనిపించనున్నాడు. అతని జీవితంలో తర్వత జరిగే సంఘటనలు అతని జీవితాన్నే మార్చేస్తాయి. ఇదిలా ఉంటే నాని ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఆగిపోనందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













