ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేసుకున్న నాని
దసరా సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమా హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్ఛితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నాడు నాని.
హాయ్ నాన్న తర్వాత నాని, వివిఏక్ ఆత్రేయతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే నాని, వివేక్ కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జత కట్టబోతున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఓ సమాచారం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది.
నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో రానున్న సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్‌ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ తో ఓజీ సినిమా చేస్తున్న ప్రియాంక, ఆ తర్వాత తెలుగులో చేయనున్న సినిమా ఇదేనని సమాచారం. వివేక్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ప్రియాంకకు ఈ సినిమా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటికే నాని, ప్రియాంక కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చినప్పటికీ అది మంచి హిట్ కాలేదు. మరి ఈ సారైనా వీరిద్దరూ కలిసి హిట్ అందుకుంటారేమో చూడాలి.













