నాని సరసన సమంత?
సమంత నానితో కలిసి ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఎటో వెళ్లిపోయింది మనసు లో స్క్రీన్ రొమాన్స్ పండించింది. తాజాగా ఈ జంట మళ్లీ మరో సినిమాలో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తన తరువాత సినిమాని నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వ్యూహం టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాని పక్కన సమంత అయితేనే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఆమేరకు త్వరలోనే ఆమెను సంప్రదించనున్నారు. మరి సమంత ఈసారి నాని సరసన నటిస్తోందో లేదో చూడాలి. ఈ సినిమా థ్రిల్లర్ అంశాలతో సాగుతుందని, సినిమాలోని నానికి సుధీర్‌బాబుకి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తిచేసిన ఇంద్రగంటి, త్వరలో సినిమాను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు.













