దానిపై దృష్టి పెట్టనున్న నాని
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. రన్ రాజా రన్, సాహో సినిమాలతో తన సత్తాను చాటుకున్న సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్, నేచురల్ స్టార్ నానితో ఓ సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు.
ఓజీ రిలీజ్ తర్వాత ఈ ఏడాదిలోనే నానితో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు సుజిత్. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం చేస్తున్న నాని త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో నటించనున్నాడు నాని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
నానితో సుజిత్ చేయబోయే సినిమా రన్ రాజా రన్ తరహాలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి ఉంటుందని తెలుస్తోంది. కథ కొత్తగా ఇంట్రెస్టింగ్ ఉండటం వల్లే నాని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాని నుంచి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆశించడంతో నాని ఈ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.













