Nani: అక్కతో చిన్న నాటి ఫోటోను షేర్ చేసిన నాని

హిట్3(Hit3) సినిమాతో రీసెంట్ గా రూ.100 కోట్ల మార్క్ ను మరోసారి అందుకుని సూపర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని(Nani). అయితే ఇప్పుడు తాజాగా నాని మరోసారి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కానీ ఈసారి నాని ఎట్రాక్ట్ చేస్తుంది సినిమాతోనో, తన యాక్టింగ్ తోనో కాదు, సోషల్ మీడియాలో తాను చేసిన పోస్ట్ తో. నాని తన సోదరి దీప్తి బర్త్ డే సందర్భంగా ఓ చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.
ఈ ఫోటోలో నాని, తన అక్క దీప్తి(Deepthi) ఇద్దరూ ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. నాని షేర్ చేసిన ఈ ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీప్తి కేవలం నానికి సోదరిగానే కాకుండా నాని విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. రీసెంట్ గా నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు(Court) సినిమాకు దీప్తి కో ప్రొడ్యూసర్ గా ఉండటంతో పాటూ ఆ సినిమా కోసం దీప్తి ఎంతో కష్టపడింది.
అంతేకాదు నాని నిర్మాణంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్ సినిమాల సక్సెస్ లో కూడా దీప్తి పాత్ర ఉంది. దీప్తి కో ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. డైరెక్టర్ కూడా. మీట్ క్యూట్(Meet Cute) తో పాటూ అనగనగా ఒక నాన్న(Anaganaga Oka Nanna) అనే షార్ట్ ఫిల్మ్ కు కూడా దీప్తి దర్శకత్వం వహించింది. తన అక్క బర్త్ డే సందర్భంగా నాని చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ “అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సెలబ్రేషన్స్ ను నీతో కలిసి చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నా”నని దీప్తితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.