దసరా మరో పుష్ప అవుతుందా?
గతేడాది అంటే సుందరానికీ సినిమాతో హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని తన కెరీర్లో ఫస్ట్ టైమ్, రిస్క్ తీసుకుని మరీ తన మార్కెట్ పరిధిని దాటి రిస్క్ తీసుకుంటున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న దసరా సినిమా కోసం నాని కష్టం బాగా కనిపిస్తుంది. తెలంగాణ పీరియాడికల్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీని శ్రీకాంత్, నానికి చెప్పినప్పుడే తన క్యారెక్టర్‌కు సంబంధించిన ఆలోచనలను డైరెక్టర్‌తో షేర్ చేసుకున్న నాని, తన లుక్, గడ్డం, గుబురు జుట్టు గురించి కూడా వివరించాడట.
ఈ మధ్య సినిమాలో స్టోరీ కన్నా, హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది. దానికి ఉదాహరణ పుష్ప సినిమానే. ఆ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పుష్ప రాజ్ క్యారెక్టర్ వల్లే సినిమాకు ఆ రేంజ్ హైప్ వచ్చింది. పుష్పలో బన్నీ క్యారెక్టర్ ఎలా హైలైట్ అయిందో దసరా సినిమాలో నాని క్యారెక్టర్ కూడా అంతే హైప్ ఇస్తుందట. అందుకే నాని ఈ సినిమా కోసం అంత కేర్ తీసుకుంటున్నాడు.
రీసెంట్గా జరిగిన ఫ్యాన్స్ మీట్లో కూడా నాని ఇదే గెటప్‌లో కనిపించాడు. ఎందుకంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా రోజుల వరకు గుర్తుండిపోతుందని అలా చేశానని చెప్పుకొచ్చాడు నాని. దసరా సినిమాలో నాని యాటిట్యూడ్‌తో ఇంప్రెస్ చేస్తే మాత్రం దసరా సినిమా మరో పుష్ప అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. దసరా స్టోరీ చాలా గ్రిప్పింగ్ రాసుకున్నట్లు ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి.
కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోని ధూమ్ ధామ్ సాంగ్ ఇప్పటికే మంచి హిట్ అయింది. ఈ సినిమాలో నాని ఊరమాస్ యాక్టింగ్‌తో ఊపిరాడనీయకుండా చేస్తాడని, దసరాలో నాని నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ చెప్తోంది. మరి కొత్త కథ, కొత్త దర్శకుడు, నాని నట విశ్వరూపం కలిసి దసరాను ఏ రేంజ్ సినిమాను చేస్తాయో చూడాలి.













