నాని- వేణు సినిమా ఆ నేపథ్యంలోనే!
గతేడాది దసరా, హాయ్ నాన్న తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమా సినిమాకీ కొత్తదనం చూపిస్తూ వస్తున్న నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా కోసం యాక్షన్ మోడ్ లోకి దిగాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాని ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మే లోపు సరిపోదా శనివారంను పూర్తి చేయాలని చూస్తున్నాడట నాని. ఆ తర్వాత బలగం ఫేమ్ వేణు యల్దండి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం వేణు, నానికి ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వేణు చెప్పిన కథ నానికి బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
అయితే ఈ సినిమా గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నానితో వేణు చేయబోయే సినిమా తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ తో పీరియాడిక్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన నాని, ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని చేసిన దసరా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు వేణుతో తెలంగాణ పల్లెటూరిలో పీరియాడిక్ లవ్ స్టోరీ అంటే ఈ సినిమా నాని కెరీర్లో మంచి చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.













