బింబిసార2పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనే దర్శకుడు, హీరో ఇద్దరూ చెప్పారు. అప్పటినుంచి బింబిసార2 కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికి హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెల నుంచి బింబిసార2 షూటింగ్ మొదలు పెడతామని చెప్పిన కళ్యాణ్ రామ్, ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. బింబిసారకు దర్శకత్వం వహించిన వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభరతో బిజీ గా ఉన్నాడు. ఎంత కాదన్నా ఆ సినిమా కోసం ఓ సంవత్సరం పట్టనుంది.
మరి బింబిసార2 కు స్టోరీ ఎవరు అందించారనేది తెలియాలంటే మరికొంత టైమ్ పట్టనుంది. బింబిసార టైమ్ లోనే డైరెక్టర్ తో రెండు కమిట్మెంట్స్ తీసుకున్న కళ్యాణ్ రామ్, సక్సెస్ మీట్ లో కూడా దీని గురించి అనౌన్స్ చేశారు. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో కానీ వశిష్ఠ బింబిసార2 కాదని, మెగా కాంపౌండ్ లోకి వెళ్లి విశ్వంభర చేస్తున్నాడు. ఎలాగైతేనేం ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న బింబిసార2 వచ్చే ఏడాది మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుందనైతే కళ్యాణ్ రామ్ స్పష్టం చేశాడు.













